Health Tips : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా? – TV9
Health Tips : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా? – TV9
గుడ్డులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. రోజుకో గుడ్డు వెరీ గుడ్డు అంటారు. గుడ్డును పరిపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఉదయం అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. దానిలో ఉండే ప్రధాన పోషకాల గురించి చూద్దాం. వాస్తవానికి ఆరోగ్యకరమైన అల్పాహారం రోజును శక్తివంతంగా ప్రారంభించడానికి పునాదిగా నిలుస్తుంది. ఇడ్లీ, దోశ వంటి సాధారణ వంటకాలకు ప్రత్యామ్నాయంగా, పోషకాలు నిండిన గుడ్డు అద్భుతమైన ఎంపిక.. గుడ్డును అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుందని.. ఆహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి వివిధ రకాలుగా సహాయపడతాయి. గుడ్డు అనేది అధిక-నాణ్యత గల ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. ఈ ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు, శరీరంలోని కణజాలాల నిర్మాణానికి కీలకమైనవి. అల్పాహారంలో ప్రోటీన్లు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగి, అనవసరమైన చిరుతిళ్ళను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవడం ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే పచ్చసొనలో కూడా అనేక పోషకాలు ఉన్నందున, దానిని తినడం వల్ల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. గుడ్డు రుచిని పెంచడానికి కొద్దిగా ఉప్పు, కారం చల్లుకొని తినవచ్చు.
గుడ్డు తినని వారికి ప్రత్యామ్నాయంగా, శనగలు వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను ఉడకబెట్టి తీసుకోవచ్చు.. ఇవి కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#healthtips #tv9d #tv9telugu


Leave a Reply